Breaking News
Home / Lifestyle / Business / ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్లతో ఓలా క్రెడిట్ కార్డ్స్!

ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్లతో ఓలా క్రెడిట్ కార్డ్స్!

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ప్రవేశించింది. క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్బీఐ, వీసా భాగస్వామ్యంతో తీసుకొచ్చిన క్రెడిట్ కార్డులను బుధవారం ఆవిష్కరించింది. ఎటువంటి ఫీజు లేకుండానే ఓలా యాప్ ద్వారా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకొనే వెసులుబాటు కల్పించింది. 2022 నాటికి కోటి ఓలా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రకటించడం విశేషం. పేటీఎం తర్వాత ఈ విధమైన క్రెడిట్ కార్డులను ఓలా మాత్రమే ప్రవేశపెట్టింది. ఓలా క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్స్ అందిస్తున్నట్టు సంస్థ తెలిపింది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ చేసుకోవచ్చు. వినియోగదారులకు అత్యున్నత సేవలు అందించేందుకు ఓలా సిద్ధంగా ఉందని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తెలిపారు.

Check Also

యధావిధిగా కొనసాగనున్న గ్రూప్ -2 ఇంటర్వ్యూలు

Share this on WhatsAppన్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *