న్యూఢిల్లీ: నాలుగు రోజుల పాటు భారత్ పర్యటనలో ఉన్న బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోదీ పసందైన విందు ఏర్పాటు చేశారు. మొదటి రోజు హసీనాకు ఇష్టమైన పూర్తి శాకాహార వంటకాలే వండించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. దహీబల్లా పాప్రీ, బాద్షాహీ పులావ్, భర్వాన్ కుంభ్ రోగానీ, షాహీ దాంగ్రీ దాల్‌తో పాటు చెనా మల్పువా వంటకాలను వడ్డించారు. చివరకు ఇద్దరు నేతలు ఓ కప్పు ఫిల్టర్ కాఫీతో భోజనాన్ని ముగించారు.
మరో ఆసక్తికర సన్నివేశమూ జరిగింది. ఇరువురు నేతలు భోజనం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఓల్డ్ క్లాసిక్స్‌ని కూడా ప్లే చేసింది. ‘రఘుపతి రాఘవ రాజారాం, ఎక్లచలోరే, రామ్ రతన్ ధన్‌పాయో లాంటి క్లాసిక్స్‌తో పాటు బాలివుడ్ పాటలైన ఓసమ్ కుచ్ అజీబ్థీ, తుమ్కో దేఖాతో ఖయాల్ ఆయా లాంటి పాటలను కూడా ప్లే చేశారు.