Breaking News
Home / Crime / ఖమ్మంలో పాత కరెన్సీ స్వాధీనం….

ఖమ్మంలో పాత కరెన్సీ స్వాధీనం….

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్‌ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీ రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్‌లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసు​కున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *