Breaking News
Home / States / Andhra Pradesh / రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు…

రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు…

ఆలమూరు : సైకిల్‌ను కారు ఢీకొనడంతో వృద్ధునికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం ఆలమూరు మండలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మండలంలోని జొన్నాడ తారకరామ కాలనీకి చెందిన గాంధీ (65) జాతీయ రహదారిపై సైకిల్‌ తీసుకుని నడిచి వెళ్లుతున్నారు. స్థానిక సెంటర్‌ వద్ద రోడ్డు దాటుతుండగా… రావులపాలెం వైపు వెళుతున్న కారు గాంధీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధునికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు. వృద్ధుని తీసుకువెళ్లేందుకు 108, హైవే అంబులెన్స్‌ లు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుని పరిస్థితి విషమంగా మారింది. వెంటనే అప్రమత్తమైన హైవే పెట్రోలింగ్‌ చేస్తున్న ఎఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్‌ రాజు సాయంతో తమ పెట్రోలింగ్‌ వాహనంలో హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి వృద్ధుడిని తరలించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో వృద్ధునికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసు సిబ్బంది సేవలను పలువురు కొనియాడారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *