Breaking News
Home / States / Andhra Pradesh / నేడు న్యూఢిల్లీలో లోక్ సభ నూతన సభాపతి నియామకం

నేడు న్యూఢిల్లీలో లోక్ సభ నూతన సభాపతి నియామకం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ నూతన సభాపతి నియామకం చేపట్టనుంది. రాజస్థాన్‌లోని కోటా నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నూతన స్పీకర్‌గా నామినేషన్ వేయనున్నారు. కాగా ఆయనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనకు వివిధ పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ సంతకం చేసింది. వైసీపీతో పాటు శివసేన, బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, మిజో నేషనల్ ఫ్రంట్, అకాలీ దళ్, లోక్‌ జన్‌శక్తి పార్టీ, జేడీయూ, అన్నాడీఎంకే, అప్నా దళ్ పార్టీలు ఓం బిర్లాకు మద్దతుగా సంతకాలు చేశాయి.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాంనారాయణ్‌ మీనాపై 2.5 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *