తిరుమల: తిరుమల ఆలయంలో నవంబరు 4న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఇందుకోసం 3న అంకురార్పణ జరుగుతుంది. అలాగే 8వ తేదీన ప్రబోధనై ఏకాదశి, మతత్రయ ఏకాదశి, 9న కైశిక ద్వాదశి ఆస్థానం, 12న కార్తీకదీపం, 22న స్మార్త ఏకాదశి, 23న మధ్వ ఏకాదశి, 24న ధన్వంతరి జయంతి తదితర విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
