Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘ఐఐటీ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలి’

‘ఐఐటీ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలి’

అమరావతి: మద్రాస్‌ ఐఐటీ నివేదికపై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని వెలగపూడి రైతులు డిమాండ్‌ చేశారు. తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని మద్రాస్‌ ఐఐటీ చెప్తోందని వారు తెలిపారు. చంద్రబాబు బినామీలు ఇక్కడ ఎవరున్నారో శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నేతలు నిరూపించాలని రైతులు సవాల్‌చేశారు. కనీసం తమ సమస్య వినకపోగా బినామీలమంటూ సన్న, చిన్నకారు రైతులను కించపరుస్తారా అంటూ మండిపడ్డారు. ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని మట్లాడటం కాదు బినామీలెవరో చూపించాలని వారు సవాల్‌ చేశారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌చేశారు. రాజధాని రెఫరెండంగా జరిగే ఎన్నికల్లో వైకాపా మళ్లీ గెలిస్తే సముద్రంలో రాజధాని కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని రైతులు స్పష్టంచేశారు. వెలగపూడి రిలేనిరాహారదీక్షలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *