Breaking News
Home / States / Andhra Pradesh / వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో …

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో …

గుంటూరు జిల్లా :పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీకాంతమ‍్మ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో వారింట విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని ఎమ్మెల్యేను పరామర్శించారు.విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించారు. పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకనేతలు శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా.. 2018 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శంకర్ రావు తొలి ప్రయత్నంలోనే పెదకూరపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ కు నమ్మకస్తుడిగా ఆయన పార్టీకి సేవలందించారు. ఆయన కష్టాన్ని గుర్తించిన సీఎం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. జగన్ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో కష్టపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *