Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ పార్టీపై జగన్ సెటైర్ …

టీడీపీ పార్టీపై జగన్ సెటైర్ …

అమరావతి: గత ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీకి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం జగన్‌ ఆరోపించారు. అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ 2014-17 వరకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామన్నారు. అలాగే 2017-19 వరకు రూ.570 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయని చెప్పారు. సున్నా వడ్డీపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. రికార్డులు తెప్పిస్తా.. రాజీనామా చేస్తారా? అని వ్యాఖ్యానించారు. కేటాయింపుల్లో రూ.172 కోట్లు కనిపిస్తాయి.. కానీ ఖర్చు సున్నా అన్నారు. 2018-19 రైతు రుణాల లెక్కల ప్రకారం.. సున్నా వడ్డీ పథకానికి ప్రభుత్వం రూ.3,068 కోట్లు ఇవ్వాలని చెప్పారు. ఐదేళ్లకు సున్నా వడ్డీకి రూ.15 వేల కోట్లు ఇవ్వాలని వివరించారు. రైతులను పట్టించుకోలేదు కాబట్టే విపక్షంలో కూర్చున్నారంటూ టీడీపీని ఉద్దేశించి జగన్‌ సెటైర్ వేశారు.

సీఎం స్థాయిలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలని జగన్‌కు చంద్రబాబు సూచించారు. మా పాలసీలు మాకు ఉంటాయి.. మీ పాలసీలు మీకు ఉంటాయని చెప్పారు. వయసుకు విలువ ఇవ్వడం నేర్చుకోండని హితవు పలికారు. విపక్షాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గాడిదలు కాశారా అంటూ అవమానిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఆందోళన చేస్తుంటే.. కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌ విధించారని విమర్శించారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *