రాజమండ్రి: కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో బోటును వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐరన్ రోప్ తెగిపోవడంతో రెండు రోజులపాటు చేసిన ప్రయత్నం విఫలమైంది. నేడు మూడో రోజు బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం మరోసారి లంగరు వేసి బోటును బయటకు లాగేందుకు యత్నిస్తున్నారు. బోటు ప్రమాదం జరిగి 18 రోజులు కాగా ఇంకా 16మంది జాడ తెలియాల్సి ఉంది.
