Breaking News
Home / National / ఆ రెండూ కలహాల కూటమిగా మరోసారి రుజువు….

ఆ రెండూ కలహాల కూటమిగా మరోసారి రుజువు….

ముంబయి: బీజేపీ-శివసేనది కలహాల కూటమని మరోసారి రుజువు చేసుకుంది. గురువారం వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్‌పవార్‌ సారథ్యంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటిన విషయం తెలిసిందే. శివసేన పత్రికలో మిత్రపక్షమైన బీజేపీ గురించి ప్రస్తావించకుండా ఎన్సీపీని ప్రశంసల్లో ముంచెత్తింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి వివరిస్తూ రాసిన కథనంలో కాంగ్రెస్‌, ఎన్సీపీలకు సముచిత స్థానం కల్పిస్తూ బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది. ప్రత్యేకంగా పవార్ గురించి కూడా రాసింది.

‘పార్టీ మారిన వారి సాయంతో ఎన్నికల్లో గెలవాలంటే కుదరదు. సతారాలో ఉదయ్‌రాజే భోస్లే భారీ ఓటమి చవి చూడటంతో ఈ విషయం మరో సారి రుజువైంది’ అని చురకలు అంటిస్తూ కథనాన్ని రాసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలు కలిపి 162 స్థానాలను గెలుచుకున్నాయి. శివసేన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవడంతో ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరోసగం పంచుకునే ప్రతిపాదన కూడా తెరమీదకు వచ్చింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *