ఢిల్లీ: శుక్రవారం జరిగిన పరపతి సమీక్ష సమావేశంలో ఆర్బీఐ మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుని వడ్డీరేట్లను తగ్గించింది. ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి 5.15 శాతంగా నిర్ణయించింది. రివర్స్ రెపో రేట్‌ను 4.90శాతం, బ్యాంక్ రేట్‌ను 5.40శాతంగా నిర్ణయించారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీని 6.9శాతం నుంచి 6.1శాతానికి, 2020-21 సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్బీఐ 7.2కు సవరించింది. ఆర్థిక మందగమనం దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినట్లు అర్థమవుతోంది.
