మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రేమించిన పిల్ల, పెద్దలు చూసిన పిల్ల.. ఇద్దరినీ తన సొంతం చేసుకున్నాడు. కెరియాకు చెందిన సందీప్ కాలేజీ టైంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ నడుస్తుండగానే తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ వ్యవహారం పంచాయితీకి చేరింది. ఆ యువతులు సందీప్తోనే కలిసి ఉంటామని చెప్పడంతో పెద్దలు చేసేదేమీ లేక ఇద్దరి మెడలో అతనితో తాళి కట్టించారు.
