Breaking News
Home / Lifestyle / Business / రూపాయి జోరు.. ఐదేళ్ల రికార్డు

రూపాయి జోరు.. ఐదేళ్ల రికార్డు

ఒకే రోజు 100 పైసల లాభం
ముంబై : రూపాయి జోరు శుక్రవారం కూడా కొనసాగింది. ఐదేళ్లలో తొలిసారిగా ఒక్క రోజే 100 పైసలు లాభపడి రూపాయి రికార్డు సృష్టించింది. క్రూడాయిల్‌ ధర తగ్గుముఖం పట్టడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేసుకోవటంలో భారత్‌కు మినహాయింపును ఇచ్చేందుకు అమెరికా సుముఖంగా ఉందన్న వార్తలతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి దూసుకుపోయింది. మరోవైపు ఈక్విటీ మార్కెట్లలో బుల్లిష్‌ ట్రెండ్‌ ఉండటం, విదేశీ నిధులు వెల్లువెత్తటం రూపాయి జోరుకు మద్దతుగా నిలిచాయి. రెండు సెషన్లలో రూపాయి ఏకంగా 150 పైసలు లాభపడటం విశేషం. గురువారం నాడు రూపాయి 50 పైసలు లాభపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 73.14 స్థాయి వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 102 పైసలు లాభపడి 72.43 స్థాయిలను తాకింది. చివరకు 100 పైసల లాభంతో 72.45 స్థాయి వద్ద స్థిరపడింది.

2013, సెప్టెంబరు తర్వాత రూపాయి ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి కావటం విశేషం. క్రూడాయిల్‌ ధర తగ్గుముఖం పట్టడంతో కరెంట్‌ ఖాతా లోటు మరింత పెరగకపోవచ్చన్న అంచనాలు రూపాయి బలోపేతానికి ప్రధాన కారణంగా ఉంది. మరోవైపు భారత్‌కు చమురు దిగుమతులపై మినహాయింపులు ఇచ్చే అంశాన్ని ట్రంప్‌ సర్కార్‌ పరిశీలిస్తుండటం కూడా ఇందుకు దోహదపడింది. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో రూపాయి ఐదేళ్లలో తొలిసారిగా రికార్డు స్థాయిలో లాభపడిందని విశ్లేషకులంటున్నారు. ముడి చమురు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోవటం, చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తి పెంచేందుకు సుముఖత వ్యక్తం చేయటం సానుకూల అంశాలని వారు పేర్కొన్నారు.

Check Also

టెట్ పేపర్ లీక్.. పరీక్ష వాయిదా వేసిన బీఎస్‌ఈ

Share this on WhatsAppభుబనేశ్వర్: ఒడిశా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఓటీఈటీ) ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *