నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండగా మారింది. ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.30 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు ఉంది. గత సంవత్సరం ఇదే రోజు 63 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిలువ ఉంది. ఈ సంవత్సరం రబీ పంటను రైతులు తొందరగా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు ఉండటంతో త్వరలోనే రబీకి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తామని, అందుకు రైతులు సిద్ధంగా ఉండి నీటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
