Breaking News
Home / Politics / 144 సెక్షన్ తో కొనసాగుతున్న పోలింగ్…

144 సెక్షన్ తో కొనసాగుతున్న పోలింగ్…

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం మొత్తం 302 పోలింగ్‌ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *