Breaking News
Home / National / వెయ్యి శాతానికి పైగా ఉల్లి ధరలు పెరిగాయి

వెయ్యి శాతానికి పైగా ఉల్లి ధరలు పెరిగాయి

న్యూఢిల్లీ: ఉల్లి కోస్తే కన్నీళ్లు వస్తాయి.. ప్రస్తుత సమయంలో అయితే కొనాలన్నా కన్నీళ్లే వస్తున్నాయి. కొద్ది నెలలుగా దేశంలో ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత మార్చి నుంచి ఉల్లి ధరలు 400 శాతం పెరిగిందని లోక్‌సభలో కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో ఉల్లి ధర 15.87 రూపాయలు ఉండగా ప్రస్తుతం 81.9 రూపాయలు పలుకుతోందని చెప్పారు.

అయితే ఆయన చెప్పిన ధరను కనిష్ట ధరగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఉల్లి ఎప్పుడో వంద మైలు రాయిని దాటింది. ప్రస్తుతం గరిష్టంగా 160 రూపాయలకు పైనే పలుకుతోంది. గోవాలో 165 రూపాయలుగా మంగళవారం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా 140 రూపాయలకు పైగా పలుకుతోంది. నిజానికి వెయ్యి శాతానికి పైగా ఉల్లి ధరలు పెరిగాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *