Breaking News
Home / National / ఆ పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు…

ఆ పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు…

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో అధ్యక్ష, ప్రధాని పదవులు కేవలం ముస్లింలకు మాత్రమేనని ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ స్పష్టం చేసింది. ముస్లింలు కాని వారు వాటిని అధిష్ఠించడానికి అనర్హులని పేర్కొంది. ముస్లింలు కాని వారు కూడా ఈ పదవులను చేపట్టేందుకు వీలుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన క్రిస్టియన్‌ ఎంపీ నవీద్‌ ఆమిర్‌ జీవా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతుండగా, ఇమ్రాన్ ప్రభుత్వం దానిని అడ్డుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అలీ మహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశమని పేర్కొన్నారు. ఇక్కడ దేశాధ్యక్షుడు, ప్రధాని పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *