Breaking News
Home / National / స్టేడియంలోకి ఒక్క త్రివర్ణం మాత్రమే..

స్టేడియంలోకి ఒక్క త్రివర్ణం మాత్రమే..

లఖ్‌నవ్: వెస్టిండీస్‌తో మంగళవారం రెండో టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏక్నా స్టేడియం పేరును మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం మ్యాచ్‌ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు స్టేడియంలోకి త్రివర్ణపతాకాలను తప్ప మరే ఇతర జెండాలను అనుమతించలేదట. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు కానీ, టోపీలను గానీ ఎలాంటివి ధరించి స్టేడియంలోకి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

దీని గురించి లఖ్‌నవ్ సీనియర్‌ పోలీస్‌ సుపరిటెండెంట్‌ కళానిధి నైథనీ మాట్లాడుతూ.. ‘‘ఏక్నా స్టేడియం పేరును అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంగా మారుస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ స్టేడియం యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హాయాంలో నిర్మించడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమాజ్‌వాదీ శ్రేణులు తిరస్కరించారని ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సమాచారం వచ్చింది. ఈ క్రమంలో సుమారు 1500మంది పార్టీ శ్రేణులు బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎరుపు టోపీలు, నలుపు జెండాలతో మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఒక్క త్రివర్ణపతాకానికి సంబంధించిన జెండాలు తప్ప.. మరెలాంటి జెండాలు, టోపీలు, బ్యానర్లను స్టేడియంలోకి అనుమతించలేదు’ అని తెలిపారు.

అయితే వెస్టిండీస్ అభిమానులు తమ జాతీయ జెండాను స్టేడియంలోకి అనుమతించలేదని వాపోతున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో నిరుత్సాహంతో వెనుదిరిగిపోయామని సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Check Also

ఏబీ డివిలియర్స్ వీర విజృంభణ.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

Share this on WhatsAppబెంగళూరు: ఐపీఎల్ సీజన్-12లో భాగంగా చినస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *