Breaking News
Home / Sports / పీవీ సింధు మాత్రమే అర్హత సాధించింది.

పీవీ సింధు మాత్రమే అర్హత సాధించింది.

గ్వాంగ్‌ఝౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు భారత షట్లర్లలో పీవీ సింధు మాత్రమే అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌ ఈ నెల 11 నుంచి 16 వరకు చైనాలో జరగనుంది. సీజన్‌కు ముగింపు అయిన ఈ మెగా టోర్నీలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న ప్లేయర్లు మాత్రమే ఆడాలి. కానీ, సింధు టాప్‌-8లో లేక పోయినా.. వరల్డ్‌ చాంపియన్‌షిప్ విజేత హోదాలో టోర్నీకి అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ జంట వేగంగా ఎదిగినా టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కలేదు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *