Breaking News
Home / States / Andhra Pradesh / చెత్త బంతులతో ఓపెనర్ అర్ధశతకం…

చెత్త బంతులతో ఓపెనర్ అర్ధశతకం…

విశాఖ: టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన రోహిత్‌ శర్మ(52; 84 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ (39; 96 బంతుల్లో 6×4, 1×6)తో కలిసి శుభారంభం చేశాడు. లంచ్‌ విరామానికి టీమిండియా ఒక వికెట్‌ కూడా నష్టపోలేదు. దీంతో 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 91 పరుగులు సాధించింది. సన్నాహక మ్యాచ్‌లో పరుగులేమీ సాధించకుండా ఔటైన రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతాడోనని అంతా ఆందోళన చెందారు. అయితే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ మయాంక్‌తో సమన్వయం చేసుకొంటూ చక్కని భాగస్వామ్యం నిర్మించాడు. ఓపెనర్లు ఇలాగే చెలరేగితే టీమిండియా భారీ స్కోర్‌ సాధించడం ఖాయం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *