Breaking News
Home / National / నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం

నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం

జైలు అధికారులకు 15 మంది పౌరుల లేఖలు

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషులైన నలుగురికి ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో త్వరలో ఉరి తీయనున్న నేపధ్యంలో పలువురు భారత పౌరులు తాము జైల్లో వాలంటీర్లుగా పనిచేస్తామని సంసిద్ధత వ్యక్తం చేస్తూ జైలు అధికారులకు లేఖలు రాశారు. నిర్భయ దోషులకు ఉరి తీసే సమయంలో తమకు జైల్లో వాలంటీర్లుగా పనిచేసే అవకాశం కల్పించాలని 15 మంది తీహార్ జైలు అధికారులకు లేఖలు పంచించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి వాలంటీర్లుగా పనిచేసేందుకు 15 మంది పౌరులు లేఖలు రాశారని తీహార్ జైలు అధికారి వెల్లడించారు. దీంతోపాటు యూకేలోని లండన్ నగరంతోపాటు అమెరికా నుంచి కూడా న్యాయవాది, ఛార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న ఇద్దరు వృద్ధులు కూడా జైల్లో వాలంటీరుగా నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం కల్పించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులకు లేఖలు రాయడం విశేషం.

కాగా ప్రస్థుతానికి వాలంటీర్ల సేవలు జైలుకు అవసరం లేదని జైలు అధికారులంటున్నారు. నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్ష వేయనున్న దృష్ట్యా మండోలీ జైల్లో ఉన్న పవన్ గుప్తా అనే నిర్భయ దోషిని తీహార్ జైలుకు మూడు రోజుల క్రితమే తరలించారు. తీహార్ జైలులో మొత్తం 12 మంది ఖైదీలకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. తీహార్ జైల్లో తలారీ లేకపోవడంతో మీరట్ జైలు నుంచి తలారీని తీసుకువచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *