Breaking News
Home / States / Andhra Pradesh / మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి…

మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి…

విజయనగరం : కార్పొరేట్‌ లకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు.  మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ప్రజలు దీన్ని ప్రతిఘటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురంలో ఉన్న సుందరయ్య భవన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ విధానాలను వారు ఎండగట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, రిజర్వు బ్యాంకులో ఉన్న ప్రజాధనాన్ని కార్పొరేట్‌ లకు వరంగా తీస్తున్నారని, వారికి ఊడిగం చేసి..వారి రుణాలు మాఫీ చేసి ప్రజల పై భారం మోపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ప్రజలు వీటిని తిప్పికొట్టాలని, పోరాటం చేస్తున్న సీపీఎంకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *