రేపల్లె: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా.. సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ.. కార్మిక చట్టాల సవరణలు చేస్తున్నారని, గతంలో జీఎస్టీ, నోట్ల రద్దుల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. రైల్వే, బ్యాంకింగ్, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వ విధానాలు దెబ్బతిస్తున్నాయని విమర్శించారు.
