Breaking News
Home / States / రాష్ట్ర బంద్‌కు విపక్షాల మద్దతు

రాష్ట్ర బంద్‌కు విపక్షాల మద్దతు

ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన శైలీకి వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్‌కి విపక్షాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది అని భట్టి విక్రమార్క అనగా, సకల జనుల సమ్మెుగా ఈ సమ్మె రూపుదిద్దుకోంటోందని కోదండరామ్ హెచ్చరించారు. కానీ, తాము మాత్రం పార్టీలతో కలిసి పని చేసేది లేదని ఉద్యోగుల సంఘం నేత మమత తెలిపారు.

మరోవైపు కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే సమ్మె చేస్తున్నారని మంత్రి గంగుల అన్నారు. కార్మిక సంఘాలు రెచ్చగొట్టడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని కొప్పుల అభిప్రాయపడగా.. కార్మిక సంఘాల నేతలు కూడా కార్మికుల వలలో చిక్కుకున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. డ్రైవర్, కండక్టర్ పోస్టులకు ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. రోజువారీ ప్రాతిపదికన డ్రైవర్‌కు రూ.1,500.. కండక్టర్‌కు రూ.1000 చెల్లించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాల కోసం డిపోల వద్ద నిరుద్యోగులు బారులు తీరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *