Breaking News
Home / National / పౌరసత్వ బిల్‌ను వ్యతిరేకిస్తున్నాం: అంజన్ కుమార్

పౌరసత్వ బిల్‌ను వ్యతిరేకిస్తున్నాం: అంజన్ కుమార్

హైదరాబాద్: ఏఐసీసీ పిలుపు మేరకు ప్రజా వ్యతిరేక పౌరసత్వ సవరణ బిల్‌కు వ్యతిరేకంగా బుధవారం నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. ఈ బిల్ కొన్ని వర్గాలకు మాత్రమే మద్దతుగా వుందని, మోదీ, అమిత్ షాలు పౌరసత్వ సవరణ బిల్లు, జీఎస్టీ ఇలా ఏదోకరమైన బిల్లులు తీసుకువచ్చి ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రజా వ్యతిరేకంగా బిల్లును పాస్ చేశారు. మోదీ, అమిత్ షాలు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ముస్లింలకు పౌరసత్వం ఉండదన్న వాదన వస్తోందని, అందుకే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత దేశం అంటే సెక్యులర్ దేశమని, ఈ పౌరసత్వ బిల్లు అన్నివర్గాలకు ఆమోదయోగ్యాంగ ఉండాలని అంజన్ కుమార్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *