Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కడప ఉక్కుకు ఖనిజం సరఫరా….

కడప ఉక్కుకు ఖనిజం సరఫరా….

అమరావతి: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారిద్దరూ సమీక్ష నిర్వహించారు. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్‌ఎండీసీ నుంచి ఖనిజం సరఫరాకు ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ అంగీకారం తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమకు ఖనిజం సరఫరాకు కేంద్రం అంగీకారం తెలపడంతో త్వరలోనే ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది.

Check Also

నేడు ఏరువాక పౌర్ణమి..

Share this on WhatsAppతొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *