Breaking News
Home / National / మన హెలికాప్టర్‌ను మన మిస్సైలే కూల్చింది….

మన హెలికాప్టర్‌ను మన మిస్సైలే కూల్చింది….

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో డాగ్‌ఫైట్ జరుగుతున్న సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్‌ను మనం ప్రయోగించిన క్షిపణే కూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ భదౌరియా తెలిపారు. మన చాపర్‌ను మనం కూల్చివేయడం అతి పెద్ద తప్పిదమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన సంఘటన గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ రోజున జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఎంఐ 17 హెలికాప్టర్ కూలిపోయింది. బాలాకోట్‌పై భారత వైమానిక దళాలు దాడికి వెళ్లిన మరుసటి రోజు ఈ ప్రమాదం జరిగింది. అయితే మనం వదిలిన మిస్సైళ్ల వల్లే ఆ హెలికాప్టర్ కూలినట్లు తేలింది. దీనిపై ఏర్పాటు చేసిన సైనిక కోర్టు విచారణ ముగిసిందని భదౌరియా తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన ఇద్దరు ఆఫీసర్లపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇలా జరగడం పెద్ద పొరపాటే అని, మరలా ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదం పట్ల ఐఏఎఫ్ కొన్ని నెలల క్రితమే సైనిక విచారణ చేపట్టింది. అయితే కనీసం నలుగురు ఆఫీసర్ల పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు చనిపోయారు.హెలికాప్టర్‌లో ఉన్న ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో సిస్టమ్ స్విచాఫ్ చేసి ఉందని, దీంతో సమాచార సరఫరా నిలిచిపోయిందని, గ్రౌండ్ స్టాఫ్‌, సిబ్బంది మధ్య సంబంధాలు తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కమిటీ గుర్తించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *