ఇరాక్: ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీస్తున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 60 మందికి పైగా మృతిచెందారు. మరో 2500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల సమావేశాలను బహిష్కరిస్తారని ప్రకటించారు.
