Breaking News

Recent news

ఎన్నికల్లో మద్యం పారకుండా చర్యలు…రూ.6కోట్ల మద్యం స్వాధీనం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరిహద్దుల్లో ఉన్న నాలుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు తెలంగాణాలో మద్యం విక్రయాలను నిషేధిస్తామని ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పొరుగురాష్ట్రాల్లోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 4గంటల సమయం పడుతోంది. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read More »

సీబీఐ డైరెక్టర్‌కు అన్యాయం జరిగింది: స్వామి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి బాసటగా నిలిచారు. అలోక్‌వర్మ నిజాయితీ కలిగిన వ్యక్తి అని, ఆయనకు ‘చాలా అన్యాయం’ జరిగిందని స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‍గా ఉన్నప్పటి నుంచి అలోక్‌వర్మ తనకు తెలుసునని అన్నారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసు, ఇతర కేసుల్లో సీబీఐలో ఆయన పనిచేయడం కూడా చూశానని చెప్పారు. ”మేము చేపట్టిన అవినీతి …

Read More »