Breaking News

Recent news

ప్రజల ఆవేదనకు ఓ యువతీ నిర్వాకం…

పట్నా: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీహార్‌ అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి నీరు అక్కడే..ఎక్కడ జనాలు అక్కడే. వారం రోజులుగా వారి వేదన వర్ణనాతీతం. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో నరకం అనుభవిస్తున్నారు. ఓవైపు జనాలు అల్లాడిపోతుంటే, అదే వర్షపు నీటిలో ఓ యువతి ఫొటోషూట్‌ చేయించుకుంది. ఫలితంగా నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటోంది. పాట్నాకు చెందిన అదితి సింగ్‌ అనే ఫ్యాషన్‌ టెక్నాలజీ …

Read More »

డికె జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు…

న్యూఢిల్లీ : కర్ణాటక కాంగ్రెస్‌ నేత డికె శివకుమార్‌ జ్యుడిషియల్‌ రిమాండ్‌ను అక్టోబర్‌ 15 వరకూ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో శివకుమార్‌ జ్యుడిషియల్‌ రిమాండ్‌ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరు పరిచారు. తీహార్‌ జైలులో ఈ నెల 4, 5 తేదీలలో శివకుమార్‌ను ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.

Read More »

నిండుకుండను తలపిస్తున్న జురాల ప్రాజెక్టు…

జూరాల: ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న భారీ వరదలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.350 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.316 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 77 వేల క్యూసెక్కులు కాగా, 70,749 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు నివేదిక విడుదల చేశారు.

Read More »