Breaking News

Recent news

డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

పాట్నా : బీహార్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని పాట్నాలో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ చెరవులను తలపిస్తున్నాయి. అయితే ఈ వరదల్లో సామాన్య ప్రజలే కాదు… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ కూడా చిక్కుకున్నారు. పాట్నాలోని ఆయన నివాసం ఉన్న రాజేంద్ర నగర్‌ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు …

Read More »

మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్….

నెల్లూరు: సచివాలయ ఉద్యోగులు ఎవరికీ తలొంచొద్దని మంత్రి అనిల్ అన్నారు. సోమవారం నగరంలో సచివాలయ ఉద్యోగులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాటమీద నిలబడి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని వ్యాఖ్యానించారు. నిజాయితీగా ఉద్యోగాలు పొందితే కొందరు జీర్ణించుకోలేక అభాండాలు వేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Read More »

పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన మలేషియా…

న్యూయార్క్‌: ఆర్టికల్‌ 370 రద్దు చేసిన సమయం నుంచి పాకిస్థాన్‌ భారత్‌పై విషం చిమ్ముతునే ఉంది. తనకు మద్దతు ఇచ్చే దేశాలను కూడగట్టుకుని, భారత్‌పై తమ అక్కసును వెళ్లగక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు చైనా, టర్కీ దేశాలు మద్దతు ఇస్తుండగా తాజాగా ఇందులో మలేషియా కూడా చేరింది. జమ్మూ-కాశ్మీర్‌ను భారత్‌ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధి సభల మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ ఆరోపణలు చేశారు. అనంతరం …

Read More »