Breaking News
Home / Crime / కథువా జిల్లా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు…

కథువా జిల్లా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు…

శ్రీనగర్: పాకిస్థాన్ దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లా సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. మన భారత బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సైనికుల కాల్పులను సమర్ధంగా తిప్పికొట్టారు. దీంతో పాక్ సైనికులు తోక ముడిచారు. పుల్వామా ఘటన, భారత్ వాయుసేన దాడుల అనంతరం పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతోంది.   ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సోమవారం పూంచ్ జిల్లా సలోత్రి సరిహద్దుల్లో పాక్ సైనికులు మొర్టార్ షెల్స్ తో దాడులు చేయడంతో భారత జవాన్ ఒకరు మరణించారు.

Check Also

కశ్మీర్‌ వద్దు..కోహ్లిని ఇవ్వండి: పాక్ అభిమానులు

Share this on WhatsAppఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటం తో ఆ దేశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *