శ్రీనగర్: పాకిస్థాన్ సోమవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్లోని బందిపొరా జిల్లాలోని సరిహద్దు వద్ద భారత జవాన్లపై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్లో పాకిస్థాన్ సైనికులు భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికులు కూడా వారికి ధీటుగా స్పందించినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరులైనట్లు వెల్లడించారు. అమరుడైన జవానుకి సైనిక ఉన్నతాధికారులు నివాళులర్పించారు.
