Breaking News
Home / National / మరోసారి సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం…

మరోసారి సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం…

పంజాబ్‌: సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని హుస్సేనివాలా సెక్టారులో పాక్‌ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ పరిధిలోని ఝూగే హజారా సింగ్‌ గ్రామం వద్ద రెండు డ్రోన్లు కలియతిరిగడం మరోసారి కలకలం రేపింది. ఆ డ్రోన్లు పాక్‌ వైపు నుంచి వచ్చినట్లు హజారాసింగ్‌ గ్రామస్థులు తెలిపారు. ఆ గ్రామం వద్ద డ్రోన్లు కొంతసేపు చక్కర్లు కొట్టినట్లు ఆ గ్రామస్థులు సరిహద్దు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో పంజాబ్‌ పోలీసులతో కలిసి భద్రతాదళాలు ఆ డ్రోన్ల కోసం గాలిస్తున్నాయి. అనుమానాస్పదంగా డ్రోన్లు తిరుగుతున్నట్లయితే వెంటనే సమాచారమివ్వాలని స్థానికులకు పోలీసులు సూచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *