Breaking News
Home / National / జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు..ఆరుగురికి గాయాలు

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు..ఆరుగురికి గాయాలు

పూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మరోసారి కాల్పులు జరిపారు. బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ ఆర్మీ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా మెంధార్, బాలాకోటి సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న ఓ జేసీబీ డ్రైవరు ఆచూకీ లభించలేదు. జేసీబీ డ్రైవరు ఆచూకీ కోసం జమ్మూకశ్మీర్ పోలీసులు గాలిస్తున్నారు. భారత సైనికులు తిప్పికొట్టడంతో పాక్ ఆర్మీ కాల్పులు నిలిపివేశారు. పాక్ సైనికులు షహపూర్, కిర్నీ సెక్టార్లలో శనివారం కూడా కాల్పులు జరిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *