జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లా హీరానగర్ ప్రాంతంలోని మన్యారి పోస్టు వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. భారత సరిహద్దుల్లో పాకిస్థానీ రేంజర్లు 54 బాంబులు, 33 ఆర్డీఎస్ విసరడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన కానిస్టేబుల్ అభిషేక్ రాయ్ గాయపడ్డారు. గాయపడిన అభిషేక్ రాయ్ ను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. బీఎస్ఎఫ్ జవాను కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. గత మూడు రోజులుగా పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉంది.
