Breaking News
Home / National / తపాలా సేవలు నిలిపివేసిన పాక్: భారత్ ఆగ్రహం

తపాలా సేవలు నిలిపివేసిన పాక్: భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య మరింత దూరం పెరిగింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారత్‌కు తపాలా సేవలను నిలిపివేసింది పాకిస్తాన్. దాదాపు రెండు నెలల నుంచి పాక్ నుంచి తపాలా సేవలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రసారాలు-సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా పాకిస్తాన్ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా వ్యవహరించడమేంటని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ చర్యలను తప్పు పడుతూ ఆయన ట్వీట్ చేశారు.

‘‘అన్ని దేశాల తపాలా శాఖలు ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పని చేస్తాయి. పాకిస్తాన్ చర్య దీనికి వ్యతిరేకంగా ఉంది. పాక్ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుంది’’ అని కేంద్ర ప్రసారాలు-సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *