Breaking News
Home / World News / బ్యాంకులు హ్యాక్ అవలేదు : పాకిస్థాన్

బ్యాంకులు హ్యాక్ అవలేదు : పాకిస్థాన్

ఇస్లామాబాద్ : బ్యాంకులపై హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు హుటాహుటిన స్పందించింది. పెట్టుబడిదారులు, బ్యాంకు ఖాతాదారులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించింది. బ్యాంకు ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్లు ఆందోళన వ్యక్తమవుతోందని, అయితే బ్యాంకింగ్ వ్యవస్థ హ్యాకింగ్‌కు గురి కాలేదని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం 22 పాకిస్థానీ బ్యాంకులకు చెందిన సుమారు 20 వేల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను హ్యాకర్లు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డులను ఉపయోగించి ఎంత సొమ్ము దొంగతనానికి గురైందో తెలియడం లేదు.

కేంద్ర బ్యాంకు విడుదల చేసిన ఓ ప్రకటనలో చాలా పాకిస్థానీ బ్యాంకుల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్లు వస్తున్నవార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంకు ఈ వార్తలను స్పష్టంగా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసింది.

అంతకుముందు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైబర్ నేరాల విభాగం అధిపతి మహమ్మద్ షోయబ్ రెండు టీవీ ఛానళ్ళతో మాట్లాడుతూ దాదాపు అన్ని పాకిస్థానీ బ్యాంకులు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపారు. ఖాతాదారుల సొమ్ము భారీగా దొంగతనానికి గురైందన్నారు.

Check Also

ట్రంప్‌ సర్కార్‌కు న్యాయస్థానం ప్రశ్న

Share this on WhatsApp80% దరఖాస్తులను రద్దు చేస్తారా? ట్రంప్‌ సర్కార్‌కు న్యాయస్థానం ప్రశ్న మనవాళ్లకు సానుకూలంగా నిర్ణయం వాషింగ్టన్‌: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *