Breaking News
Home / Sports / టీ20 చరిత్రలో పాక్ సరికొత్త రికార్డు

టీ20 చరిత్రలో పాక్ సరికొత్త రికార్డు

దుబాయ్: టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో దుబాయ్‌లో జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌పై 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా, పాకిస్థాన్‌కు ఇది వరుసగా 8వ విజయం. వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్, ఐర్లండ్, పాక్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు గెలిచిన భారత్ పాక్ తర్వాతి స్థానంలో ఉంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Check Also

టీం ఇండియాకు మహేశ్ బాబు అభినందనలు

Share this on WhatsAppఆస్ట్రేలియా గడ్డపై టీం ఇండియా చరిత్ర సృష్టించింది. దాదాపు 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *