Breaking News
Home / National / పాక్ అధికార పార్టీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…

పాక్ అధికార పార్టీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…

ఇస్లామాబాద్‌: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్ కాలేజీల సదస్సులో పాల్గొన్న పాకిస్థాన్ అధికార పార్టీకి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫావద్ చౌదరీ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రజలు ఎదురుచూడకూడదని, నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 400 శాఖలను రద్దు చేయనున్నామని చెబుతూ మంత్రి మరో షాకిచ్చారు. పాక్‌తో పాటు ప్రపంచ దేశాల్లోనూ ప్రభుత్వాలు బలహీనమవుతున్నాయన్నారు. ప్రజలెవరూ ఉద్యోగాల కోసం ఎదురుచూడవద్దు అని, ఉద్యోగాలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని మంత్రి అన్నారు. 1970 దశకంలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాలు టార్గెట్ పెట్టుకునేవని, ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలకే చెందుతుందన్నారు. ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిపై వెంటనే ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మళ్లీ ఆయన మాట మార్చి ఉద్యోగ కల్పనకు కావాల్సిన వాతావరణాన్ని ప్రభుత్వాలు సృష్టించాలన్నారు. రానున్న అయిదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *