Breaking News
Home / National / కర్తార్‌పూర్‌ సందర్శనకు పాకిస్తాన్ అనుమతి ఇవ్వడంతో సిక్కు భక్తుల హర్షాతిరేకాలు

కర్తార్‌పూర్‌ సందర్శనకు పాకిస్తాన్ అనుమతి ఇవ్వడంతో సిక్కు భక్తుల హర్షాతిరేకాలు

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ గురద్వార దర్బార్ సాహిబ్ వెళ్లే భక్తులు గరిష్టంగా 11 వేల రూపాయలు తీసుకెళ్లడానికే అనుమతి ఇస్తారు. అలాగే ఒక్కో భక్తుడు ఏడు కిలోలకు మంచి లగేజీని తీసుకెళ్లొచ్చు. అంతకు మించిన నగదు లేదా లగేజీని వెంట తీసుకెళ్తే అనుమతించబోరని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ గురువారం ఇక్కడ స్పష్టం చేసింది. కర్తార్‌పూర్ గురద్వారకు వెళ్లే భక్తులు ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అన్నదానిపై హోమ్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏకో ఫ్రెండ్లీ మెటీరియల్ అంటే గుడ్డ సంచులు మాత్రమే తీసుకెళ్తే మంచిది. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సహకరించాలి. ఉదయం కర్తార్‌పూర్‌కు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్రయాణాన్ని రూపొందించుకోవాలి. పాకిస్తాన్‌లోని నరోవాల్ జిల్లాలో వేంచేసిన కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాలంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకాష్‌పర్బ్550.ఎంహెచ్‌ఏ.జీవోవీ.ఇన్ సైట్‌కు అతడు/ఆమె అడ్వాన్స్‌గా పేర్లు నమోదు చేయించుకోవాలి. తాము ఎప్పుడు వెళ్తుందీ ఆ తేదీకి ముందే ఆన్‌లైన్‌లో నమోదుచేసుకుంటే యాత్ర సుఖవంతంగాసాగుతుంది. తాము వెళ్లాలనుకున్న తేదీకి నాలుగు రోజుల ముందే అనుమతి తీసుకోవల్సి ఉంటుందని హోమ్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భక్తులను కర్తార్‌పూర్ సాహిబ్‌కే అనుమతిస్తారు తప్ప మరే ఇతర ప్రాంతానికి వెళ్లడం కుదరదు. ఒక్కో భక్తుడు 11 వేల రూపాయల నగదుకు మించి తీసుకెళ్లకూడదు. అలాగే ఏడు కిలోల లగేజీనే అనుమతిస్తారు. తాగునీరు కూడా ఆ లగేజీలోనే కలుపుకొని లెక్కిస్తారు. పొగ తాగడంపై కూడా ఆంక్షలుంటాయి. పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌లోని ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్(పీటీబీ) కాంప్లెక్ వద్ద పొగతాగడాన్ని నిషేధించారు. మార్గంలో అనుమానాస్పద వస్తులు ఏమైనా కనిపిస్తే ముట్టుకోకూడదు. అలాంటివి వారి దృష్టికి వస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అధికారుల అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగం అలాగే ఫొటోలు తీయడం చేయకూడదు. భక్తులు ఒక్కసారి సందర్శనకు 20 యుఎస్ డాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం లెవీగా నిర్ణయించింది. సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడిపారు. రావి నదీ తీరాన్న గురద్వార కర్తార్‌పూర్ ఉంది. చారిత్రక కర్తార్‌పూర్ కారిడార్‌పై సిక్కు భక్తులను అనుమతిస్తూ భారత్- పాకిస్తాన్ గురువారం సంతకాలు చేశాయి. భారత్ అధికారులు కర్తార్‌పూర్ వెళ్లి ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ దశలో ఒప్పందంపై సంతకాలు చేయడం ఓ మైలురాయిగా చెప్పవచ్చు. భారత సిక్కు భక్తులు ఎలాంటి వీసా లేకుండా పాస్‌పోర్టు ఉంటే కర్తార్‌పూర్ వెళ్లవచ్చు. విదేశాల్లో ఉంటున్న భారత సంతతికి చెందిన వారు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రోజుకు ఐదువేల మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శిస్తారని అంచనా. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనంగా భక్తులను అనుమతిస్తారు. ఏడాది పొడుగునా యాత్ర కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వారానికి ఏడు రోజులు కారిడార్ అందుబాటులో ఉంటుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *