Breaking News
Home / National / 1992, 2019 ప్రపంచకప్‌లలో పాక్ సేమ్ టు సేమ్!

1992, 2019 ప్రపంచకప్‌లలో పాక్ సేమ్ టు సేమ్!

బర్మింగ్‌హామ్: ఈ ప్రపంచకప్‌లో పడుతూ లేస్తూ వస్తున్న పాకిస్థాన్ 1992లో ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న నాటి రోజులను గుర్తుకు తెస్తోంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం 238 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది ఏడో మ్యాచ్. 1992 ప్రపంచకప్ కప్‌లోనూ పాక్ ఏడో మ్యాచ్‌లో సరిగ్గా 49.1 ఓవర్లలోనే విజయం సాధించింది. అంతేకాదు, ఆ ప్రపంచకప్‌లోనూ కివీస్ తన తొలి ఓటమిని పాక్‌పైనే నమోదు చేసింది. తాజా ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌ చేతిలోనే ఓడింది. ఇదొక్కటే కాకుండా ఆ ప్రపంచకప్‌లో పాక్ తన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ తర్వాత మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నాలుగు, ఐదు మ్యాచుల్లో ఓడింది. ఆరు, ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. ఈ శకునాలు చూస్తుంటే పాక్ ఈ ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంటుందని ఆ దేశ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Check Also

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

Share this on WhatsAppబెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *