తాడేపల్లి: నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ అమరావతికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. మరోవైపు ఎంపీడీవో సరళపై శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్య కుదిరిచ్చే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు జగన్ అప్పగించగా వారు ఆ నేతలతో సమావేశమయ్యారు. మంత్రి అనిల్, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు.
