Breaking News
Home / National / పాండ్యాకు శస్త్రచికిత్స విజయవంతం…

పాండ్యాకు శస్త్రచికిత్స విజయవంతం…

లండన్‌: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు. గత కొంత కాలంగా హార్ధిక్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సర్జరీ చేయించుకున్న హార్ధిక్ కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. త్వరగా కోలుకోవాలని విషెస్ చెప్పిన వారికి హార్ధిక్ ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగనున్నట్లు కూడా తన పోస్టులో చెప్పాడు. కనీసం అయిదు నెలల పాటు హార్ధిక్ క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో హార్దిక్ కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు హార్ధిక్‌ను పక్కన పెట్టారు. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో హార్దిక్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *