Breaking News
Home / States / Andhra Pradesh / 22లోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్‌…

22లోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్‌…

విశాఖపట్నం: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ శుక్రవారం 22వ జన్మదినం జరుపుకున్నాడు. దక్షిణాఫ్రికాతో విశాఖలో తొలి టెస్టు ఆడుతున్న భారత జట్టు పంత్‌ బర్త్‌డే సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కేక్‌కట్‌ చేయించి ఘనంగా జరిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను టీమిండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోల్లో పంత్‌ ముఖానికి మొత్తం కేక్‌ పూసి ఉండడంతో పాటు టీమిండియా ఆటగాళ్లు అతడికి కేక్‌ తినిపించారు.

టెస్టు వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా గాయపడి జట్టుకి దూరం కాగా అదే సమయంలో అవకాశం వచ్చిన పంత్‌ సద్వినియోగం చేసుకున్నాడు. తన అసమాన ప్రతిభతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుతంగా రాణింణి పర్మనెంట్‌ ప్లేయర్‌గా మారే క్రమంలో వరుసగా విఫలమౌతున్నాడు. ఇటీవల పేలవ షాట్లతో వికెట్‌ సమర్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కి ఎంపికైనా తొలి టెస్టులో అతడిని ఎంపికచేయలేదు టీమిండియా. సాహా ఫిట్‌నెస్‌ సాధించడంతో అవకాశం ఇస్తున్నట్లు కెప్టెన్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *