బొప్పాయి హల్వా
కావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు;
పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడి
లేదా కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు.
తయారీ:
►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి
►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి
►బాగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి
►బాదం పప్పుల పొడి జత చే సి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి
►జీడి పప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి
►కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది.