Breaking News
Home / States / Andhra Pradesh / తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య….

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య….

చిత్తూరు: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్యవేడు పట్టణంలో జరిగింది. సత్యవేడులోని బలిజ వీధికి చెందిన చెంచురాముడు, కవిత దంపతుల రెండో కుమార్తె స్వప్న స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతుంది. తల్లిదండ్రులు మందలించారని ఆమె మనస్తాపానికి గురైంది. బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆమె అదృశ్యమైందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యవేడు సమీపంలోని వ్యవసాయ బావిలో స్వప్న శవమై తేలింది. స్థానికులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *