Breaking News
Home / Lifestyle / Recipes / ఎంతో రుచిగా ఉండే పార్సీ కట్‌లెట్స్‌ మీ కోసం…!

ఎంతో రుచిగా ఉండే పార్సీ కట్‌లెట్స్‌ మీ కోసం…!

పార్సీ కట్‌లెట్స్‌

కావలసినవి:
మటన్‌ – 200 గ్రాములు (సన్నటి ముక్కలుగా చేసి), అల్లం పేస్టు – ఒక టీస్పూను, వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను, పచ్చిమిర్చి – ఒకటి (కచ్చాపచ్చాగా నూరి), లవంగాలు, దాల్చినచెక్కపొడి – అర టీస్పూను, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప గుజ్జు – రెండు టేబుల్‌స్పూన్స్‌, పుదీనా – ఆరు ఆకులు, కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ – తగినన్ని, గుడ్లు – నాలుగు (బాగా గిలక్కొట్టి), నూనె- వేగించడానికి సరిపడా.

తయారీ విధానం:
ఒక బౌల్‌లో మటన్‌ ముక్కల్ని వేసి చేత్తో నాలుగు నిమిషాలు కలపాలి. అందులో, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, కచ్చాపచ్చాగా నూరిన పచ్చిమిరప, పసుపు, కారం, లవంగం-ధనియాల పొడి, మెత్తగా నలిపిన బంగాళాదుంప ముక్కలు, పుదీనా, ధనియాలు, ఉప్పులన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మీడియం సైజు పట్టీలు చేయాలి. కట్‌లెట్స్‌ను రెండు వైపులా బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించి అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఎగ్‌ మిశ్రమంలో ఈ కట్‌లెట్స్‌ను ముంచి వేడి నూనెలో రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చే దాకా పట్టీలను వేయించాలి. ఈ వేడి మటన్‌ కట్‌లెట్స్‌ను ఉల్లిపాయలు, చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టమైన వారు వీటిపై నిమ్మరసం పిండుకోవచ్చు.

Check Also

స్వీట్‌పొటాటో బాల్స్‌

Share this on WhatsAppకావలసినవి: చిలగడదుంపల గుజ్జు – 3 కప్పులు (స్వీట్‌పొటాటోలను ఉడికించుకుని ముద్దలా చేసుకోవాలి), చీజ్‌ – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *