Breaking News
Home / States / ‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి…

‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి…

హైదరాబాద్‌ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కూమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *